కేంద్రం మంత్రి నితిన్‌ గడ్కరీతో రాష్ట్ర ఎంపీలు భేటీ

మహబూబ్‌నగర్‌, నాగర్‌ కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని పలు సమస్యలపై కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో లోక్‌సభ సభ్యులు మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ పోతుగంటి రాములు సమావేశమయ్యారు. జాతీయ రహదారి 44 పరిధిలో కొత్తూరు నుంచి కొత్తకోట వరకు సర్వీసు రోడ్డు నిర్మాణం లేక జనం పడుతున్న ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకుపోయారు. పలు చోట్ల అండర్ పాస్ లు లేక జరుగుతున్న ప్రమాదాల్లో అనేక మంది మృతి చెందిన విషయాన్ని ఆయనకు తెలిపారు. సర్వీస్ రోడ్లు మరియు అండర్ పాస్ మరియు రోడ్ అండర్ బ్రిడ్జెస్ నిర్మాణం చేపట్టాలని కోరారు.  కనిమెట్ట, వేముల, ముదిరెడ్డిపల్లి వద్ద అండర్ బ్రిడ్జిల నిర్మాణం అత్యవసరమని కోరారు. ఈ మేరకు కేంద్ర మంత్రికి ఎంపీ వినతిపత్రం సమర్పించారు.